గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచన

గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచన

ముద్ర ప్రతినిధి, మెదక్: గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలని, సకాలంలో ఇమ్మునైజేషన్ జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా  వైద్యాధికారులు, ఐసిడిఎస్ అధికారుకులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డే, అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం పంపిణి  కార్యక్రమాలతో పాటు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు, మహిళా క్లినిక్ లు, కంటి వెలుగు, యెన్.సి.డి కిట్ల పంపిణి, పదవ  తరగతి విద్యార్థులలో మానసిక ఒత్తిడి తగ్గించే విధంగా ప్రేరణ తరగతుల నిర్వహణ తదితర  అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు.ఈ సమావేశంలో   జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి చందు నాయక్, జిల మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ, డిఎస్ఓ శ్రీనివాస్, డిప్యూటీ డిఎమ్అండ్హెచ్ఓలు, సి. డి. పి. ఓలు,  వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.