కూచారం పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

కూచారం పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం
Fire in Kucharam Industrial Estate

సమయానికి రాని ఫైర్ ఇంజన్ 
తూప్రాన్ (ముద్ర న్యూస్): మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కూచారం పారిశ్రామిక వాడలోని కేబుల్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ప్లాంట్ లో మంటలు చెలరేగి పొగ కమ్మడంతో కార్మికులు కంపెనీ బయటకు పరుగులు తీశారు. కంపనీ సిబ్బంది నర్సాపూర్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫోన్ చేస్తే గంట ఆలస్యంగా ఫైర్ ఇంజన్ వచ్చింది.

ప్రమాదం జరిగిన సమయంలో ఫోన్ చేస్తే ఆలస్యంగా ఫైర్ ఇంజన్ రావడం పట్ల పరిశ్రమల సిబ్బంది, కార్మికులు ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సకాలంలో గమనించడంతో పెద్దగా నష్టం వాటిల్లలేదు. మనోహరాబాద్ మండలంలో సుమారు రెండు వందలకు పైగా పరిశ్రమలు ఉండగా ఏదయినా ప్రమాదం జరిగితే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సాపూర్ ఫైర్ స్టేషన్ ను అశ్రాయించాలి. ఇక్కడ అగ్నిమాపక కేంద్రం లేకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  గత వారం రోజులలో ఇది రెండవ ప్రమాదం. కావడంతో ప్రజలు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు స్పందించి పారిశ్రామిక వాడలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.