ఆధార్, బియ్యం కోసం విద్యుత్ టవరెక్కిన వ్యక్తి

ఆధార్, బియ్యం కోసం విద్యుత్ టవరెక్కిన వ్యక్తి

ముద్ర ప్రతినిధి, మెదక్: ఆధార్ కార్డులో నా కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయడం లేదని... వచ్చే రేషన్ బియ్యం సరిపోక కుటుంబ పోషణ భారమవుతుందని మెదక్ పట్టణం గాంధీనగర్ శివారులో ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి హల్ చల్ చేసిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మెదక్ పట్టణంలోని గాంధీనగర్ లో నివాసం ఉంటున్న సమీర్  ( 30)  మధ్యాహ్నం గాంధీ నగర్  శివారులోని విద్యుత్ టవర్ పైకి ఎక్కి  హల్ చల్  చేశాడు. ఈ సంఘటన తెలుసుకొని పోలీసులు, స్థానికులు టవర్ దిగాలని చెప్పిన సుమారు గంట పాటు టవర్ పై వున్నాడు. నా అభిమాన నాయకుడు మ్యాడం బాలకృష్ణ వచ్చేవరకు టవర్ దిగేది లేదని  టవర్ పైనే ఉన్నాడు.

స్థానికులు టిపీసీసీ ప్రతినిధి  మ్యాడం బాలకృష్ణకు సమాచారం అందించారు. ఆయన అక్కడకు చేరుకొని అధికారులుతో మాట్లాడి పరిష్కారస్తామని చెప్పారు. అనంతరం టవర్ దిగాడు. అనంతరం సమీర్ మీడియాతో మాట్లాడుతూ ఆటో నడిపించుకుంటూ బతుకడం, కుటుంబ పోషణ భారం అవుతుందని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న సమస్య పరిష్కరించడం లేదని తెలిపాడు. ఈ సందర్భంగా టిపిసిసి నేత మ్యాడం బాలకృష్ణ మాట్లాడుతూ సమీర్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటానని, అధికారులతో మాట్లాడీ ఆధార్  కార్డు ఇప్పిస్తానని చెప్పారు. అప్పటి వరకు కుటుంబ పోషణకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపాడు.