కేసీఆర్ అంటే అభివృద్ధి, సంక్షేమం మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి

కేసీఆర్ అంటే అభివృద్ధి, సంక్షేమం మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: కెసిఆర్ అంటే అభివృద్ధి, సంక్షేమం, మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని మెదక్ బిaarఎస్ అభ్యర్థి ఎం. పద్మ దేవేందర్ రెడ్డి కోరారు. ఆదివారం మండల కేంద్రం చిన్నశంకరంపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మైనార్టీలు, పట్టణవాసులు, మహిళలు, బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ.. మరొకసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎస్. కొండాపూర్ గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే అభివృద్ధి, తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేశారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎస్. కొండాపూర్ తం డాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలతో కలసి ఆడి, పాడారు.

బి.ఆర్.ఎస్ కు మాల సంఘాల మద్దతు

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలల సమస్యలను పరిష్కారిస్తామన్న బి.ఆర్.ఎస్. పార్టీకే తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు రామచందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమ లు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదైన ఉన్నది అంటే అది కె.సి.ఆర్, ప్రభుత్వమేఅన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రపంచ మేదావి భారత రాజ్యాంగ పితామహుడు, భారత రత్న డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని స్థాపించడం ఎంతో హర్షించదగ్గ విషయం అన్నారు.

ఈ సమావేశంలో వైస్ చైర్మన్ తాలూకా అనిల్, కన్వీనర్. నల్లాల కనకరాజు, కో కన్వీనర్ జి యాదవ్, నాయకులు జిల్లా సుధాకర్, లక్ష్మణ్, కంబాల పోచయ్య, ఇసాక్, నాగేష్, రాము షా, రాజు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్‌లో చేరిన ఎంఎస్ఎస్ఓ సభ్యులు చిన్న శంకరంపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఎంఎస్ఎస్ఓ సభ్యులు, యూత్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిజాంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వెంట మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ తిరుపతి రెడ్డి, మండల ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.