గాంధీ  సిద్ధాంతాలతోనే  తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పధకాలు అమలు 

గాంధీ  సిద్ధాంతాలతోనే  తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పధకాలు అమలు 
  • జిల్లా కలెక్టర్ రాజర్షి షా నివాళులు

ముద్ర ప్రతినిధి, మెదక్:జాతిపిత మహత్మాగాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్  రాజర్షి షా అన్నారు.  సోమవారం మాహత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లోని గాంధీ చిత్రపటానికి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్  లావణ్యరెడ్డి, అదనపు కల్లెక్టర్ లు రమేష్,  వెంకటేశ్వర్లుతో  కలిసి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  నిజాయితీగా పనిచేస్తే తప్పకుండ సక్సెస్ సాధిస్తామన్నారు.   సత్యగ్రహమే అయుధంగా అహింస, శాంతి మార్గములో దేశానికి స్వాతంత్య్ర సముపార్జన చేసి మహానీయుడు మహాత్మగాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మశ్రీ, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...

మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యం.పద్మ దేవేందర్ రెడ్డి  జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సత్యాగ్రహమే ఆయుధముగా అహింస మార్గంలో పోరాడి భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రం తీసుకొచ్చారని తెలిపారు.విద్య, ఆర్థిక, కుల సమానత్వంతోనే గ్రామస్వరాజ్యం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆత్మ కమిటీ చైర్మన్ అంజగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ జయరాజ్, మెదక్ మండల రైతు బంధు అధ్యక్షులు కిష్టయ్య, నాయకులు రవీందర్,ఆంజనేయులు రవి, తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ కార్యాలయంలో...

జాతిపిత మహాత్మా గాంధీజి 154వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంధీజీ చిత్ర పటానికి జిల్లా ఎస్.పి పి.రోహిణి ప్రియదర్శి చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పి ఎస్.మహేందర్, ఎస్.బి సిఐ సందీప్ రెడ్డి, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సిబ్బంది  డి.సి.ఆర్.బి, ఎస్.బి, ఐ.టి కోర్, కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు.

బీజెపి ఆధ్వర్యంలో...

భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.