సంక్షేమ పథకా లు కొనసాగాలంటే బి ఆర్ ఎస్ పార్టీ నీ గెలిపించాలి: డీసీసీబీ చైర్మన్ గొంగిడి

సంక్షేమ పథకా లు కొనసాగాలంటే బి ఆర్ ఎస్ పార్టీ నీ గెలిపించాలి: డీసీసీబీ చైర్మన్ గొంగిడి

గుండాల నవంబర్ 26 (ముద్ర న్యూస్) తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు మండలంలో ఆదివారం ఎలక్షన్ల ప్రచారంలో,భాగంగా బండ కొత్త పెళ్లి వస్తాకొండూర్ పెద్ద పడిశాల వంగాల అంబాల పా చి ల్ల గుండాల గ్రామాల్లో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గం అన్ని రకాల అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంత అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని రకాల అభివృద్ధి చేశారని అందులో భాగంగా ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి ప్రతి గ్రామంలో సంక్షేమ పథకాలు అందించి ప్రతి ఒక్క లబ్ధి దారునికి న్యాయం చేకూర్చిందని

ఈ ఎలక్షన్లలో మీ అమూల్యమైన ఓటు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కారు గుర్తు పై ఓటేసి గొంగిడి సునీతను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళా సంఘాలకు సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు మేలు చేకూరుతుందని,దళిత బంధు బీసీ బందు గృహలక్ష్మి అమలు కావాలంటే మీరు బీఆర్ఎస్ పార్టీ నీ గెలిపించాలని అన్నారు.రైతుల సంక్షేమంగోరి 24 గంటలు కరెంటు ఇస్తున్న కెసిఆర్ ప్రభుత్వం కావాలా మూడు గంటలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ కావాలా ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో,రాష్ట్ర నాయకులు హరిశంకర్ గౌడ్ వైస్ ఎంపీపీ మహేశ్వర మహేందర్ రెడ్డి మాజీ జెడ్పిటిసిలు మందాడి రామకృష్ణారెడ్డి గడ్డమీద పండరి మండల పార్టీ అధ్యక్షుడు ఎండి ఖలీల్ మోత్కూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముగల శ్రీనివాస్ సంగీ వేణుగోపాల్ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వార్డు సభ్యులు పాల్గొన్నారు