మెదక్ జిల్లా బాధ్యతలు దామోదర్ కేనా?

మెదక్ జిల్లా బాధ్యతలు దామోదర్ కేనా?

ముద్ర ప్రతినిధి, మెదక్:ఉమ్మడి మెదక్ జిల్లా నుండి మంత్రి వర్గంలో స్థానం సంపాదించిన సి. దామోదర్ రాజనర్సింహకు సంగారెడ్డి తో పాటు మెదక్ జిల్లా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. బిఆర్ఎస్ హయాం లో కెసిఆర్ సీఎంగా ఉండగా ఉమ్మడి జిల్లా బాధ్యతలు హరీష్ రావు చుసిన విషయం తెలిసిందే. కాగా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో  ఉమ్మడి మెదక్ జిల్లా బాధ్యతలు కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి, మెదక్ జిల్లాలు దామోదర్, సిద్దిపేట జిల్లా పొన్నం ప్రభాకర్ చూసే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ (పాత కరీంనగర్ జిల్లా)  ఎమ్మెల్యేగా గెలుపొందిన పొన్నం ప్రభాకర్  రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించారు.

హుస్నాబాద్ నియోజకవర్గం సిద్దిపేట్ ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉంది. మొత్తం నాలుగు అసెంబ్లీ స్థానాలుండగా హుస్నాబాద్ మినహా గజ్వేల్(కెసిఆర్), సిద్దిపేట్(హరీష్ రావు),  దుబ్బాక(కొత్త ప్రభాకర్ రెడ్డి)లో బిఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా బాధ్యతలు చూసే అవకాశం ఉంది. ఇక  రెండు అసెంబ్లీ ష్టానాలున్న మెదక్ జిల్లాలో మెదక్ లో కాంగ్రెస్, నర్సాపూర్ లో బిఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ మొదటి సరిగా గెలుపొందడంతో మంత్రివర్గంలో చోటు లభించలేదు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ ఎమ్మెల్యేగా హెలుపొందిన సీనియర్ నేత దామోదర్ రాజానర్సింహకు మంత్రి వర్గంలో చోటు లభించింది. మొన్నటి వరకు హరీష్ రావు నిర్వహించిన వైద్య, ఆరోగ్య శాఖ కేటాయించారు. అందోల్ నియోజకవర్గంకు సంబంధించి మెదక్ జిల్లా పరిధిలో గల అల్లాదుర్గం, టేక్మాల్, రేగోడ్ మండలాలున్నాయి. సీనియర్ రాజకీయ నాయకుడైన దామోదర్ కు ఉమ్మడి జిల్లాపై మంచి పట్టు ఉంది. కాబట్టి మెదక్ జిల్లా బాధ్యతలు దామోదర్ రాజానర్సింహకె అప్పగించే అవకాశాలున్నాయి. మెదక్ జిల్లా అభివృద్ధిపై దామోదర్ ఎలా దృష్టి సారిస్తారో వేచి చూడాల్సిందే.