మహిళలు, పిల్లలకు భద్రతకే షీ టీమ్స్ పనిచేయాలి  

మహిళలు, పిల్లలకు భద్రతకే షీ టీమ్స్ పనిచేయాలి  
  •  అదనపు ఎస్.పి  మహేందర్

ముద్ర ప్రతినిధి మెదక్ :-మెదక్ జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ మహేందర్ జిల్లా షీ టీం బృందాలతో శుక్రవారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు.  స్నేహపూర్వకమైన పోలీసింగ్ అందించాలనే పెద్ద లక్ష్యంతో మహిళలకు పూర్తిగా సురక్షితమైన, భద్రమైన వాతావరణాన్నిఅందించాలనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షీ టీమ్స్ ను ఏర్పాటు చేశారన్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేస్తూ...మెదక్ జిల్లాలో ఉన్న షీ టీమ్స్ బృందాలు ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ, తెలంగాణ మోడల్ స్కూళ్లలో, రెసిడెన్షియల్, కేజీబీవీ స్కూళ్లలో విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో, షీ టీమ్స్, యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ పై అవగాహన అవగాహన కార్యక్రమాలు  విస్తృతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో షీటీమ్ ఎఎస్ఐ రుక్సానా,  లక్ష్మీ, కానిస్టేబుళ్లు, విజయ్ కుమార్, ప్రమీల, నవీన్ కాంత్, స్వరూప, శ్రీనివాస్ పాల్గొన్నారు.