పెంచిన ఆనకట్ట ఎత్తు చూపించండి

పెంచిన ఆనకట్ట ఎత్తు చూపించండి
  • మంత్రి హరీష్ కు కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ సవాల్

ముద్ర ప్రతినిధి, మెదక్:ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచామని చెప్పుకొని తిరుగుతున్న మంత్రి హరీష్ రావ్, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిలు 48 గంటల్లో వచ్చి ఎక్కడ ఎత్తు పెంచారో చూపించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ సవాల్ విసిరారు.గురువారంపాపన్నపేటలోనీ మంజీరా గార్డెన్స్ లో   ఎంపిపి చందన, బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, పలువురు ఎంపిటిసిలు, నాయకులు కాంగ్రెస్ లో చేరారు.

ఈ సందర్బంగా  మైనంపల్లి రోహిత్  పాల్గొని మాట్లాడుతూ..

2014లో  ప్రభుత్వం  అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ తెరిపించి ఉపాధి కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. 10 పది సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఎందుకు తెరవాలేదని ప్రశ్నించారు. చెరుకు రైతులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు.ఘనపూర్ ఆనకట్ట ద్వారా 21,000 వేల ఎకరాలకు సాగునీరు అందచేస్తున్నారని,ఎత్తు పెంచితే 30 వేల ఎకరాలకు సాగు నీరు అందచేయవచ్చన్నారు.సిద్దిపేటలో ఉన్న కోమటి చెరువు టూరిజం సర్కిల్  అయ్యింది తప్ప.. మెదక్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల, మెదక్ ఖిల్ల, పోచారం ప్రాజెక్టు మూడింటిని కలిపి టూరిజం సర్కిల్ చేస్తామని చేయలేదన్నారు.

ఆఫీసులు, కార్యాలయాలు సిద్దిపేటకు తరలిస్తున్నారని ఆరోపించారు.మెదక్ ఆత్మగౌరానికి, సిద్దిపేట పెత్తందారితనానికి మధ్య జరుగుతున్న పోటీ అన్నారు. తొందరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు..గత పది సంవత్సరాల నుంచి నాపై ఒక్క అవినీతి ఆరోపణ లేదని, నా మీద  ఎమ్మెల్యే   పద్మ దేవెందర్ రెడ్డి దృష్టి పెట్టడం మానుకోవాలని సూచించారు.సోనియా గాంధీ 6 గ్యారెంటీలను గడపగడపకు తీసుకెళ్లాలని,  మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారాఅనేక సేవ కార్యక్రమాలు చేశామన్నారు.2009లో మెదక్ లో మైనం పల్లి సేవ చేశాడు, మళ్ళీ మేమె వచ్చి సేవ చేస్తున్నామన్నారు. 10  సంవత్సరాలలో ఏం చేశారో చెప్పలన్నారు. జయలలిత ఆస్తులు కొనేoత డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు.వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి డిపాజిట్ గల్లంతు అవుతాయని రోహిత్ జోస్యం చెప్పారు.