108లో మహిళ ప్రసవం,తల్లీ బిడ్డ క్షేమం

108లో మహిళ ప్రసవం,తల్లీ బిడ్డ క్షేమం
108 vehicle telangana

ముద్ర ప్రతినిధి, మెదక్: పురిటి నొప్పులు వచ్చిన మహిళను 108 అంబులెన్సులో తరలిస్తుండగా సాధారణ ప్రసవమైంది. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం స్కూల్ తండాకు చెందిన గిరిజన మహిళ అమూల్  పురిటి నొప్పులతో బాధపడుతుండగా బంధువులు 108కు సమచారం ఇచ్చారు.

మెదక్ ఆసుపత్రికి 108 సిబ్బంది వాహనంలో తరలిస్తుండగా నొప్పులు అధికమయ్యాయి. ఈఎంటి రాజు వాహనంలోనే సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడ శిశువు జన్మించింది. వీరిని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. ఈఎంటి రాజును అభినందించారు.