శ్రీధర్ బాబు అనే నేను....

శ్రీధర్ బాబు అనే నేను....
  • ఆర్థిక శాఖ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రమాణ స్వీకారం...
  • మంథని నియోజకవర్గం నుండి ప్రమాణ స్వీకారోత్సవానికి భారీగా తరలి వెళ్లిన నాయకులు...

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: మంథని నియోజకవర్గం నుండి 5వ సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం రాష్ట్ర  ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావటంతో పాటు రేవంత్ రెడ్డి తెలంగాణ రెండో ముఖ్యమంత్రి గా  ప్రమాణ స్వీకారం చేయగా,  ఆయన మంత్రివర్గంలో  తొలిసారిగా మంత్రిగా శ్రీధర్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. 2009లో అప్పటి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన శ్రీధర్ బాబు అనంతరం రాజశేఖర్రెడ్డి మరణించిన తరువాత, ముఖ్యమంత్రి రోశయ్య మంత్రివర్గంలో, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ప్రమాణ శ్రీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంథని నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొనటానికి హైదరాబాద్ కు తరలివెళ్లారు. 

శ్రీధరాబాబు ప్రస్థానం......

1969లో కాటారం మండలం ధన్వాడ లో జన్మించారు.

తల్లిదండ్రులు : దుద్దిళ్ల శ్రీపాదరావు, జయమ్మ, భార్యపిల్లలు : శైలజా
రామయ్యార్ (సీనియర్ ఐఏఎస్) ఇద్దరు పిల్లలు చదువు : న్యాయవాద విద్యలో ఉత్తీర్ణత ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో న్యాయవాది చేశారు.
రాజకీయ అరంగేట్రం : తండ్రి దివంగత స్పీకర్ శ్రీపాదరావు హత్య అనంతరం రాజకీయ ప్రవేశం. 
ఎమ్మెల్యేగా : 1999 తొలిసారిగా మంథని ఎమ్మెల్యేగా ఎన్నికైనారు.
పదవులు : 2004-06 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు.
వరుసగా 2004, 2009, 2018, 2023లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004-08 వరకు ప్రభుత్వ విప్, 2009-14 వరకు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి, 2014లో తెలంగాణ ఉద్యమ సమయంలో మంథనిలో ఓటమి 2018లో తిరిగి మంథని ఎమ్మెల్యేగా విజయం, 2023లో 5వ సారి మంథని ఎమ్మెల్యేగా ఎన్నికై, మళ్లీ మంత్రి పదవి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిపిసిసి మ్యానిఫెస్టో కమిటి చైర్మన్ శ్రీధర్ బాబు వ్యవహరించారు. శ్రీధర్ బాబు మంత్రి పదవి చేపట్టడంతో మంథని నియోజక వర్గంలో ఆనంద ఉత్సవాలు వెలివేరిస్తున్నాయి శ్రీధర్ బాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో మంథని నియోజక వర్గం అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుందని మంథని ప్రజలు, కార్యకర్తలు నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.