హోం శాఖ మంత్రిగా ఉత్తమ్ 

హోం శాఖ మంత్రిగా ఉత్తమ్ 
  • రెండోసారి దక్కిన మంత్రి పదవి

హుజూర్ నగర్ ముద్ర:తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రిగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే నలమాద ఉత్తంకుమార్ రెడ్డి ని నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.గురువారం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఆధ్వర్యంలో ఉత్తమ్ తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తమ్ పేరు ముఖ్యమంత్రిగా పరిశీలనలో ఉందని ఊహాగానాలు కాంగ్రెస్ పార్టీలో వినిపించినప్పటికీ అధిష్టానం నిర్ణయం మాత్రం వేరేగా ఉంది. గతంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉత్తమ్ కి ఉంది.