రసమయిని అడ్డుకున్న గ్రామస్తులు

రసమయిని అడ్డుకున్న గ్రామస్తులు

 శంకరపట్నం ముద్ర జూన్ 14 :  ధర్మారం గ్రామంలో భూలక్ష్మి,మహాలక్ష్మి, బొడ్రాయి ప్రతిష్టాపనకు హాజరు కావడానికి వచ్చిన మానకొండూరు శాసనసభ్యులు రసమయిని గ్రామస్తులు అడ్డుకున్నారు. బుధవారం రోజున ధర్మారం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపనకు హాజరరు అయి తిరిగి వెళ్తున్న క్రమంలో ఎమ్మెల్యే రసమయిని గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, సీసీ రోడ్లు, వీధిలైట్లు కూడా సరిగా లేవని ,డబుల్ బెడ్ రూమ్ ఇల్లు  ఒక్కరికి కూడా ఇవ్వలేదని  ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని గ్రామస్తులు విరుచుకుపడ్డారు.ఈ కార్యక్రమానికి హాజరైన జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్ చొరవ  చేసుకొని గ్రామస్తులకు సర్ది చెప్పారు.