కిలోన్నర గంజాయి, 89 సెల్ ఫోన్లు పట్టివేత ఏసీపీలు నరేందర్, మాధవి

కిలోన్నర గంజాయి, 89 సెల్ ఫోన్లు పట్టివేత ఏసీపీలు నరేందర్, మాధవి

 ముద్ర ప్రతినిధి కరీంనగర్ కరీంనగర సిసిఎస్ ఏసిపి మాధవి, ఇన్స్పెక్టర్ లు, వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో కిలోన్నర గంజాయి, 89 సెల్ ఫోన్ లను పట్టుకున్నారు. సెల్ ఫోన్స్ దొంగతనం చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గురువారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టౌన్ ఏసిపి నరేందర్ మాట్లాడుతూ పట్టుబడిన వారు కర్నూలు జిల్లా డ్రోన్ మండలానికి చెందినవారు కాగా మరి కొంత మంది వికారాబాద్ జిల్లాకు చెందినవారని తెలిపారు.

ఎల్లప్ప, శ్రీను, శివ, మురళి అని వారితో పాటు మరో ఇద్దరు చిన్నా, లక్ష్మి లు కలిసి జనం రద్దీగా ఉన్న ప్రాంతాలలో సెల్ ఫోన్ దొంగతనం చేసేవారని వెల్లడించారు. కరీంనగర్, దుబ్బాక, కామారెడ్డి, వేములవాడ ప్రాంతాల్లో ఎక్కువగా దొంగతనాలు చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుండి కిలోన్నర గంజాయి, 89 సెల్ ఫోన్ లు, 45,000/- నగదు, ఒక ఆల్టో కారు, ఒక గొడ్డలి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కేసు నమోదు చేసి నలుగురిని రిమాండ్ పంపినట్లు వెల్లడించారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఈ సందర్భంగా వారు అభినందించారు.