రామాయంపేట డివిజన్ కోసం కదంతొక్కిన కాంగ్రెస్

రామాయంపేట డివిజన్ కోసం కదంతొక్కిన కాంగ్రెస్

పోరాటం మరింత ఉదృతం చేస్తాం
సిఎం సభలో నిరసన తెలుపుతాం
డీసీసీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి 
ముద్ర ప్రతినిధి, మెదక్: 
రామయంపేట రెవెన్యు డివిజన్ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కదం తొక్కింది. 50వ రోజు దీక్షలకు మద్దతుగా బుధవారం మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి  ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ విగ్రహం నుండి బస్టాండ్ వరకు    వేలాది మందితో  భారీ ర్యాలీ నిర్వహించారు. కోలాట కళాకారులు, బోనాలు, డోలు చప్పుడు ఒగ్గు కళాకారులు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ముందుకు సాగారు.  ఈ సందర్భంగా కంఠారెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కళ్ళు తెరచి చూడు, రామయంపేట పట్టణంలో వేలాదిమంది రెవెన్యు డివిజన్ కోసమై రోడ్డెక్కారు, నీకు రాజకీయ భిక్ష పెట్టినా రామయంపేటను అభివృద్ధి చేయడం పక్కన పెట్టిన మీ ఆస్తులు పెంచుకునే పనిలో ఉన్నారని విమర్శించారు. ఎమ్మెల్యే అసమర్థత వల్లనే రెవెన్యు డివిజన్ కావడంలేదన్నారు. వారం రోజుల్లో జేఏసీని రేవంత్ రెడ్డితో కలిపించి, వారి సమక్షంలోనే రెవెన్యు డివిజన్ ఏర్పాటుపై  హామీ ఇప్పిస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 3 నెలల్లో రెవెన్యు డివిజన్ ఏర్పాటు చేసే బాధ్యత తనే తీసుకుంటానన్నారు. త్వరలో మెదక్ రానున్న సీఎం ముందు కూడా నిరసన తెలుపుతామన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాలు  సంఘాలు ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లె రాంఛాందర్ గౌడ్, మామిల్ల ఆంజనేయులు, ప్రభాకర్ రెడ్డి చింతల యాదగిరి, శంరెడ్డి, రమేష్ రెడ్డి, రమణ, లింగం గౌడ్, ఆంజనేయులు గౌడ్, శంకర్, శ్రీనివాస్, అనిల్,  నాయకులు తదితరులు పాల్గొన్నారు.