బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయి 

బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయి 
  • కాంగ్రెస్ నమ్మొద్దు... సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైన కర్ణాటక  ప్రభుత్వం
  • తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైనాయని తాండూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాండూరు మండల పరిధిలోని గౌతపూర్ చెంగోల్ చింతామణి పట్నం, పర్వతాపూర్ సంకిరెడ్డిపల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తూ సంక్షేమ పథకాలను వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటు వేయాలని పేర్కొన్నారు.