వైద్యుడి నిర్లక్ష్యంతో ఇంత ఘోరం..!!

వైద్యుడి నిర్లక్ష్యంతో ఇంత ఘోరం..!!
Boy died of doctors negligence in Vikarabad

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా దోమ మండలం బొంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వైద్యం వికటించి అశ్వంత్ (12) అనే బాలుడు మృతి చెందాడు. అశ్వంత్ సోమవారం రోజున అస్వస్థతకు గురి కావడంతో గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ యూసుఫ్ వద్దకు తీసుకెళ్లారు. వైద్యం చేసిన డాక్టర్ యూసఫ్ అస్వస్థతకు గురైన బాలుడికి ఇంజక్షన్ ఇచ్చి వైద్యం చేశాడు. దీంతో అశ్వంత్  శరీరంపై బొబ్బర్లు రావడంతో పరిగి లోని డాక్టర్లను సంప్రదించగా అశ్వంత్ పరిస్థితి విషమంగా ఉంది నగర ఆసుపత్రికి తీసుకువెళ్లాలని పరిగి డాక్టర్లు సూచించారు.నగర ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తన కొడుకు మృతికి కారణమైనా ఆర్ఎంపి డాక్టర్ పై  దోమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా గ్రామస్తులు సర్ది చెప్పి ఒప్పందం కుదుర్చడంతో  బాలుడి తల్లిదండ్రులు  ఫిర్యాదు చేయకుండా వెనుదిరిగినట్టు తెలుస్తుంది. అయితే గతంలో ఆర్ ఎంపి దవాఖనలను జిల్లా వ్యాప్తంగా  సీజ్ చేసి నోటీసులు ఇచ్చిన సంగతి విధితమే.