దొంగతనాలు ఆగుతలేవు... సీసీ కెమెరాలెందుకు..?

దొంగతనాలు ఆగుతలేవు... సీసీ కెమెరాలెందుకు..?
CCTV cameras

ముద్ర, ప్రతినిధి వికారాబాద్: సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగతనాలు ఆగడం లేదని మరి అలాంటప్పుడు సీసీ కెమెరాలు ఎందుకని ప్రజలు ప్రశ్నోత్తరాలు సంధిస్తున్నారు. వికారాబాద్ పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపంలో ద్విచక్ర వాహనాలు మాయమవుతుంటే, పట్టణంలోని రైతు బజార్లో సెల్ ఫోన్ దొంగలు రెచ్చిపోతున్నారు.

కానీ ఇప్పటివరకు ఎవరు అనేది అంతుచిక్కడం లేదు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగలను గుర్తించకపోవడం ఏమిటని పోలీసు అధికారులను సోషల్ మీడియా వేదికగా జనం ప్రశ్నిస్తున్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీస్ కానిస్టేబుల్ లతో సమానమని చెబుతూ దొంగల్ని ఎందుకు గుర్తించడం లేదంటూ వాపోతున్నారు.