కాంగ్రెస్ పార్టీ సంబరాలు

కాంగ్రెస్ పార్టీ సంబరాలు

 ముద్ర. వీపనగండ్ల కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవడంతోపాటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. మండల కేంద్రమైన వీపనగండ్లలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, జూపల్లి కృష్ణారావుకు జై అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి ప్రధాన చౌరస్తాలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.