ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే సండ్ర దంపతులు..

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే సండ్ర దంపతులు..

సత్తుపల్లి -4 కుమార్తెతో వెళ్లి ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమై.
సత్తుపల్లి -5 ఓటు హక్కు వినియోగించుకున్న బిజెపి అభ్యర్థి నంబూరి..
సత్తుపల్లిలో 86.27శాతం పోలింగ్..
గం.5.00ల తర్వాత కూడా బారులు తీరిన  ఓటర్లు..
రాత్రి గం.10.00కు పూర్తి స్థాయిలో ముగిసిన ఓటింగ్..

 సత్తుపల్లి, ముద్ర. అధికారికంగా సాయంత్రం గం. 10.30కు విడుదల చేసిన లెక్కల ప్రకారం సత్తుపల్లి నియోజకవర్గంలో 86.27 శాతం పోలింగ్ నమోదయింది . ముఖ్యంగా ఈ ఎన్నికల్లో  యువకులు, మహిళలు ఉత్సాహంగా  ఓటు హక్కు  వినియోగించుకున్నారు.శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాఘమై, బీజెపి అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావు కుటుంబ సభ్యులతో వెళ్లి ఓటు వేశారు.

పందెం జోరు..
ఫలితం పై లక్షల్లో పందాలు చేతులు మారుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున పందెం కలపడం కోసం బృందాలు వస్తున్నాయి. మధ్యవర్తిగా ఉన్న బ్రోకర్లు 10శాతం మాట్లాడుకుంటున్నారు. సత్తుపల్లి మండలం సత్యం పేటలో గ్రామాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టలేదని నిరసిస్తూ గ్రామస్తులు మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ బహిష్కరించారు. తర్వాత నాయకులతో చర్చలు జరగటంతో గ్రామస్తులు ఓటింగ్ కు వెళ్లారు. సత్తుపల్లి మండలం బేతపల్లి, తుమ్మూరు  పోలింగ్ కేంద్రాల్లో  ఈవీయంలు మొరాయించిన నేపథ్యంలో చాలా నెమ్మదిగా పోలింగ్ సాగింది. దీంతో రాత్రి గం.11:00 వరకు కూడా ఓటర్లు ఓపికతో ఉండి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సత్తుపల్లి మండలం,కాకర్లపల్లి లో  స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో మద్యం మత్తులో ఉన్న తండ్రి కొడుకులకు గాయాలయ్యాయి. 

కల్లూరు మండలంలోని చెన్నూరు, పెనుబల్లి మండలంలోని లంకపల్లిలో స్వల్ప ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పోలీసు అప్రమత్తం కావాల్సి వచ్చింది. మొత్తం మీద దివంగత ముఖ్యమంత్రి  జలగం వెంగళరావు వంటి ప్రముఖులు ప్రాధాన్యత వహించిన  సత్తుపల్లి నియోజకవర్గంలో ఈసారి చరిత్రలో నిలిచిపోయే పోలింగ్ సాగటం చర్చనీయాంశంగా మారింది.మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జలగం ప్రసాదరావు,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు మాజీ డిసిసిబి చైర్మన్ మువ్వ విజయ్ బాబు అనుచర వర్గం మొత్తం కాంగ్రెస్ వైపు పనిచేసింది. రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి, శాసనసభ్యులు వెంకట వీరయ్య క్యాడర్ బీఆర్ఎస్ వైపు ఉంది. ఈ నేపథ్యంలో నువ్వా, నేనా అన్నట్లుగా సాగిన ఈ ఎన్నిక ఎలాంటి ఫలితం ఇవ్వబోతుందో అంటూ విశ్లేషకులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.