ఓటు వేయండి... ఉచిత కన్సల్టెషన్ పొందండి!

ఓటు వేయండి... ఉచిత కన్సల్టెషన్ పొందండి!
  • రుక్మిణి మల్టీస్పెషాలిటి దంత వైద్యశాల విస్తృత ప్రచారం

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: మన ఓటు మన హక్కు...ఓటు మన అందరి బాధ్యత... ఓటు వేయండి....ఉచిత కన్సల్టెషన్ పొందండి.....అంటూ బాన్సువాడ రుక్మిణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఆధ్వర్యంలో కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు.  ఓటు హక్కు పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి, ప్రజల్లో చెతన్యం రావాలి, సామాజిక బాధ్యత పెరగాలి, ఓటు మనందరి బాధ్యత అంటూ కరపత్రాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే దిశగా ప్రచారం చేస్తున్నారు ప్రముఖ దంత వైద్యుడు అచుకట్ల జీవన్. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు వేయాలి, కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారితో కూడా ఓటు వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలు పాటిస్తూనే, బాధ్యతాయుతమైన పౌరుడిగా నిలబడండి అంటూ కరపత్రం ద్వారా హితబోధ చేస్తున్నారు. ఓటు వేయండి ఉచిత దంత పరీక్షలు చేయించుకోండి, ఓటు హక్కు గురించి కరపత్రాలు ద్వారా అవగాహన కల్పిస్తూనే ఓటు హక్కు వినియోగించుకున్న వారికి ఉచిత దంత పరీక్షలు నిర్వహిస్తామని వివరిస్తున్నారు. నవంబర్ 30వ తేదీ ఓటు వేసి చేతి వేలు పై వేసిన సిరా చుక్కను చూపించినట్లయితే దంత పరీక్షలు ఉచితంగా చేస్తామని అంటున్నారు. చేతి వేలుకు సిరాచుక్క చెరిగిపోకుండా ఉన్నన్ని రోజులు దంత పరీక్షలు ఉచితంగానే నిర్వహిస్తామనీ వివరిస్తున్నారు. ఓటు మన హక్కు, మన బాధ్యత అంటూ ఓటర్లను చైతన్య పరుస్తున్న దంత వైద్యశాల నిర్వాహకుడు జీవన్ అభినందనీయులే.