కామారెడ్డిలో హోంమంత్రి కి ఘన స్వాగతం

కామారెడ్డిలో హోంమంత్రి కి ఘన స్వాగతం

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: హైదరాబాద్ నుంచి నిర్మల్ కు వెళ్తున్న రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీకి కామారెడ్డిలో జిల్లా కలెక్టర్ మంగళవారం సాయంత్రం ఘన స్వాగతం పలికారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డిలు మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. హోంమంత్రి మహమూద్ అలీ కి పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నిర్మల్ కు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ బయలుదేరి వెళ్లారు.