పలు హోటళ్ల పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు -14 కేసులు నమోదు

పలు హోటళ్ల పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు -14 కేసులు నమోదు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గల హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై  మంగళవారం నాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. పరిశుభ్రత ను పాటించని హోటళ్లకు నోటీసులు ఇచ్చి 14 కేసులను నమోదు చేశారు. ప్రతి ఫుడ్ కు సంబంధించి లైసెన్స్ ఉండాలని, లైసెన్స్ లేకుండా అమ్మకాలు జరిపితే రూ.5 లక్షల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తారని తెలిపారు. అలాగే సిబ్బందికి ఫాస్టక్ ట్రైనింగ్ ఇవ్వాలని, ఎఫ్ ఎస్ ఎస్ ఐ గైడ్ లైన్స్ పాటించాలని అధికారులు సూచించారు.