సీఎం కేసీఆర్ రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు

సీఎం కేసీఆర్ రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు
  • రేపు రెండు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు
  • పర్యవేక్షించిన స్పీకర్ పోచారం                      

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజా ఆశీర్వద సభల పేరిట ముఖ్యమంత్రి కేసిఆర్ చేపట్టిన పర్యటనల్లో భాగంగా సోమవారం నాడు కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఈమేరకు రెండు నియోజకవర్గాల్లో భారీ జనసమీకరన చేపడుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హనమంత్ షిండేలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బాన్సువాడలొంజ్ వీక్లి మార్కెట్లో, జుక్కల్ లోని జుక్కల్ చౌరస్తా వద్ద సభలను ఏర్పాటు చేశారు. సిఎం రాక సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం నెలకొంది. ఇంటింటికి వెళ్లి 30న జరిగే సభ గురించి ప్రచారం చెస్తున్నారు. 

స్పీకర్ పరిశీలన : బాన్సువాడ పట్టణంలో రేపు జరగనున్న BRS పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  "ప్రజా ఆశిర్వాద సభ " కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఈరోజు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి బాన్సువాడ నియోజకవర్గ BRS పార్టీ అభ్యర్థి, రాష్ట్ర శాసన సభాపతి  పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు.

పట్టణంలోని వీక్లీ మార్కెట్ లో జరిగే ఈ బహీరంగ సభకు బాన్సువాడ నియోజకవర్గం నలుమూలల నుండి  లక్ష మంది ప్రజలు హాజరవుతారని అందుకు అనుగుణంగా సభాస్థలి, పార్కింగ్  ఏర్పాట్లు ఉండాలన్నారు. బహీరంగ సభ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను పరిశీలించారు. సభా స్థలికి దగ్గరలో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన రెండు స్థలాలను పరిశీలించారు. ప్రజలకు ఎండ తీవ్రత నుండి రక్షణ కోసం ప్రత్యేకంగా పెండల్స్ వేస్తున్నామని, చివరన కూర్చున్న వారికి కూడా సభా వేదిక కనిపించే విదంగా సిటింగ్ ఏర్పాట్లు చేయాలని  పోచారం సూచించారు. నాయకులు పోచారం శంభురెడ్డి రెడ్డి గారు,  డాక్టర్ పోచారం రవిందర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు గురు వినయ్, జుబేర్, బాబా, ఎజాజ్, కౌన్సిలర్లు, DSP జగన్నాధ రెడ్డి, పట్టణ CI మహేందర్ రెడ్డి సభాపతి పోచారంతో ఉన్నారు.