ముస్లిం మైనారిటీల అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం

ముస్లిం మైనారిటీల అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం
  • బీఆర్ఎస్ తోనే ముస్లిం మైనారిటీలు
  • ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ ముద్ర: ముస్లిం మైనారిటీల అభివృద్ధి బీఆర్ఎస్ కేసిఆర్ తోనే సాధ్యమని రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం మైనారిటీలు బీఆర్ఎస్ తోనే ఉన్నారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని షాదీఖానా లో ఏర్పాటు చేసిన ఇమామ్ మౌజన్ల ఆత్మీయ సమ్మేళనంలో సైదిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ముస్లిం మైనారిటీలను చిన్నచూపు చూశాయని బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలను ఎంతగానో ఆదుకుందని షాదీ ముబారక్ నూతన మసీదులు ,కబరస్థాన్లు ,దర్గాల, ఏర్పాటుతో బీఆర్ఎస్  మైనారిటీలకు ఎంతగానో దగ్గర అయిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో షఫీ, ఇమ్రాన్ ముస్లిం మత పెద్దలు మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.