గర్భిణి స్త్రీలు మంచి పోషక ఆహారం తీసుకోవాలి

గర్భిణి స్త్రీలు మంచి పోషక ఆహారం తీసుకోవాలి

సర్పంచ్ అన్నెంశిరీష కొండారెడ్డి

హుజూర్ నగర్ టౌన్ ముద్ర: గర్భిణీ స్త్రీలు మంచి పోషక ఆహారం తీసుకోవాలని సర్పంచ్ అన్నెం శిరీష కొండారెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని వేపలసింగారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా టీకాలు వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీచర్ భాగ్యమ్మ ,ఆశా కార్యకర్తలు ,గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.