సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
  • మండల వైద్యాధికారి డాక్టర్ సన

హుజూర్ నగర్ టౌన్ ముద్ర:వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి డాక్టర్ సన అన్నారు. గురువారం పట్టణంలో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్ ను సందర్శించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  కలుషిత నీరు ఆహారం వలన కలరా, డయేరియా, కామెర్లు వంటి వ్యాధులు వస్తాయని దోమల ద్వారా డెంగ్యూ ,మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ ,బోధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కావున కాచి చల్లార్చిన నీటిని త్రాగడం, ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని అన్నారు. జ్వరం వస్తే ఆందోళన చెందకుండా వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పి హెచ్ ఎన్ నూర్జహాన్ బేగం , ఇందిరాలరామకృష్ణ ,పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.