అమ్మానాన్నల కలను నెరవేర్చాను..

అమ్మానాన్నల కలను నెరవేర్చాను..
  • పేద కుటుంబంలో జన్మించి ఎస్సైగా ఎంపిక
  • చిన్న వయసులో ఎస్సై ఉద్యోగం సాధించిన నన్ను అభినందిస్తున్న గ్రామస్తులు , ఉపాధ్యాయులు

ముద్ర, అనంతగిరి: అనంతగిరి మండల పరిధిలో వాయిల సింగారం గ్రామానికి చెందిన చట్టు వినయ్  సివిల్ ఎస్ఐ గా ఎంపికయ్యారు . చిన్న వయసులో ఎస్సైగా ఎంపిక కావడంతో గ్రామస్తులు అతన్ని అభినందిస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవ చేసేందుకు ఈ వృత్తిని ఎంచుకున్నట్లు వినయ్ తెలిపారు. కుమారుడు పోలీసు   ఉద్యోగం  సాధించడంతో తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుకు పేద మధ్య తరగతి అనే భేదాలు లేకుండా కష్టపడి చదివి తల్లిదండ్రులు ఆశయాలను నెరవేర్చాలి అని అన్నారు. చిన్నతనం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివి నేడు సివిల్స్  ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యాను. వినయ్ చిన్నతనం నుండి చదువులో ముందంజలో ఉంటూ నేడు ఈ విజయానికి దోహద పడింది. ఉపాధ్యాయులు సైతం  వినయ్ ను   అభినందిస్తున్నారు.