రైతు నేస్తం బి ఆర్ ఎస్ ప్రభుత్వం - పోచారం భాస్కర్ రెడ్డి

రైతు నేస్తం బి ఆర్ ఎస్ ప్రభుత్వం - పోచారం భాస్కర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: బి ఆర్ ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని,  కేసీఆర్  రైతుల మేలు కోరే మంచి మనసున్న ముఖ్యమంత్రి అని, ఈ ప్రభుత్వం రైతు నేస్తమని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరంటు లతో పాటుగా  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటలను కొనుగోలు చేస్తున్నారని అన్నారు.

బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం జాకోర సొసైటీ పరిధిలోని కొకల్ దాస్ తాండా, బాన్సువాడ మండలం బొర్లం సొసైటీ పరిధిలోని  హన్మాజీపేట పేట గ్రామాలలో బుధవారం మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ -ప్రభుత్వం ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలన్నారు.

ప్రభుత్వం మద్దతు ధర  మక్కలకు క్వింటాలు కు రూ. 1962 అని, ప్రవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుని రైతులు నష్టపోకుండా ఉండాలనే ఉద్యేశంతో  రాష్ట్రంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. సభాపతి  పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించారని తెలిపారు.

దేశంలో మరే రాష్ట్రంలోను కూడా ఈ విదంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుండి మద్దతు ధర తో కొనుగోలు చేస్తుందన్నారు.

అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడటం బాధాకరమని,
రాష్ట్ర ముఖ్యమంత్రి  పెద్ద మనస్సుతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర తో కొనుగోలు చేస్తామని ప్రకటించడం  రైతులపై ఉన్న ప్రేమకు నిదర్శనమని అన్నారు.