నిర్ణీత గడువులోగా కస్టమ్ మిల్లింగ్ పూర్తి చేయాలి : కలెక్టర్    

నిర్ణీత గడువులోగా కస్టమ్ మిల్లింగ్ పూర్తి చేయాలి : కలెక్టర్    

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: మరాడించిన బియ్యాన్ని (కస్టమ్  మిల్లింగ్ రైస్) నిర్దారిత గడువులోగా భారత ఆహార సంస్థకు చేరవేయవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. సి.ఏం.ఆర్. రైస్ కు సంబంధించి ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడవు విధించిన నేపథ్యంలో జిల్లాలోని  వివిధ రైస్ మిల్లులు తమకు కేటాయించిన లక్ష్యాలను ఏ మేరకు అధిగమిస్తున్నారో కలెక్టర్ బుధవారం  క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పిట్లం లోని మద్దెర్లచెరువు గ్రామంలో గల  బిలాల్ రైస్ మిల్లును సందర్శించి మరాడిస్తున్న   బియ్యాన్ని పరిశీలిస్తూ సి.ఏం.ఆర్. పెట్టవలసిన లక్ష్యాన్ని అధిగమించవలసినదిగా సూచించారు. లక్ష్యానికి దూరంగా (లో పర్ఫార్మెన్స్) ఉన్న  జిల్లాలోని ఇతర రైస్ మిల్లుల యజమానులు కూడా మంచిగా డెలివరీ చేస్తున్న ఇతర రైస్ మిల్లర్లతో అనుసంధానమై నిర్దారిత సమయంలోగా సి.ఏం.ఆర్. ను డెలివరీ చేయవలసినదిగా ఆదేశించారు. లక్ష్యాన్ని చేరని రైస్ మిల్లులను బ్లాక్ ,లిస్ట్ లో పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు.కలెక్టర్ ఆర్.డ్.ఓ. భుజంగం, పౌర సరఫరాల ఉప తహశీల్ధార్ తదితరులున్నారు.    

                   

ఆన్లైన్ పూర్తి చేయాలి                  

ప్రజా పాలన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు పక్కగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మద్నూర్ మండల కేంద్రంలో బుధవారం ప్రజా పాలన ద్వారా అభయహస్తం దరఖాస్తు ఫారాల ఆన్లైన్ వివరాల నమోదు ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కంప్యూటర్ ఆపరేటర్లు, అధికారులతో మాట్లాడుతూ.. తప్పులు లేకుండా  చూడాలని సూచించారు. నిర్ణీత గడువులోగా ప్రజాపాలన దరఖాస్తుల వివరాలు ఆన్లైన్లో నమోదు పూర్తి చేయాలని పేర్కొన్నారు.