కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు -పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు -పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో సోమవారం టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 63 కేంద్రాలు ఏర్పాటు చర్యగా 11899 విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. జిల్లా కేంద్రంలోని జీవధాన్ హై స్కూల్, దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు.

పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు.  అలాగే అడ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. పరీక్ష కేంద్రాల్లో కల్పించిన మౌలిక వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు.