బి ఆర్ ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డికి అన్ని సంఘాల మద్దతు

బి ఆర్ ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డికి అన్ని సంఘాల మద్దతు

బాన్సువాడ, ముద్ర :బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి  నియోజకవర్గంలో ని అనేక కుల సంఘాలు మద్దతు పలుకుతున్నాయి.  ప్రతిరోజూ వివిధ సంఘాల నాయకులు విచ్చేసి మద్దతు తెలుపుతున్నారు.  బుధవారం నాడు బీర్కూరు మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన అన్ని కుల సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు.

ఈరోజు బాన్సువాడ లోని నివాసంలో పోచారం శ్రీనివాస రెడ్డిని కలిసిన 120 ముదిరాజ్, 70 యాదవుల, 25 కురుమ, 25 గౌడ, 25 వడ్డెర, 20 ముస్లిం, 25 నాయిబ్రాహ్మణ , కుమ్మరి, కమ్మరి, చాకలి కుటుంబాల సభ్యులు తమ ఏకగ్రీవ మద్దతు తీర్మానాలను పోచారం నకు అందజేసారు.గత పది సంవత్సరాలలో పోచారం  బైరాపూర్ గ్రామానికి కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసి గ్రామంలో అన్ని రకాల మౌళిక వసతులను కల్పించారని తెలిపారు.పేదలకు సేవ చేసే పోచారం శ్రీనివాసరెడ్డికి బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి MLA గా  పోటీ చేసే అవకాశం కల్పించిన BRS పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.వచ్చే ఎన్నికలలో మా పార్టీ BRS, మా గుర్తు కారు, మా అభ్యర్థి పోచారం గారని సంఘాల ప్రతినిధులు తెలిపారు.తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బైరాపూర్ గ్రామస్తులకు పోచారం  ధన్యవాదాలు తెలిపారు.