కేసీఆర్‌తోనే తెలంగాణ భవిత - బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎద్దులు సురేందర్ రెడ్డి

కేసీఆర్‌తోనే తెలంగాణ భవిత - బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎద్దులు సురేందర్ రెడ్డి

పుట్టిన బిడ్డ తల్లి ఒడిలో ఉంటే ఎంత భద్రంగా, ఉంటుందో అలాగే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతిలో ఉంటేనే మన భవిష్యత్‌ బాగుంటుందని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్ నాయకులు ఎద్దుల సురేందర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పుల్గర్ చర్లలో చేసిన అభివృద్ధి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరుగుతూ వివరిస్తూ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ఓటు వేసి బీరం హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమం ఇంతకు రెట్టింపుతో అమలు కావాలంటే  కారు గుర్తు మీద ఓటు వేయాలని కోరారు. మూడోసారి అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌, కేసీఆర్‌ ఆరోగ్య బీమా, సౌభాగ్యలక్ష్మి పేరుతో అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేలు అందివ్వనున్నట్లు తెలిపారు.  రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని చెప్పారు.

 సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ భవిత భద్రంగా ఉంటుందని స్పష్టం చేశారు.కార్యక్రమంలో నాయకులు నాయకులు  కోటేశ్వర్ రెడ్డి తిరుపతి బుసిరెడ్డి బాబు రెడ్డి చిన్న బుజ్జన్న ,మన్యం విష్ణు చిన్న స్వాములు,గణపతి తదితరులు ఉన్నారు