కౌంటింగ్ రోజున లైవ్ కెమెరాల ఏర్పాటు 26 నాటికి పూర్తి చేయాలి - కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్

కౌంటింగ్ రోజున లైవ్ కెమెరాల ఏర్పాటు 26 నాటికి పూర్తి చేయాలి - కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: కౌంటింగ్ రోజున స్థానిక వ్యవసాయ మార్కెట్ నందు  నియోజక వర్గాలకు కేటాయించిన కౌంటింగ్ హాల్ లోపల, బయట అలాగే స్టాంగ్ రూమ్స్ బయట లైవ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్  ఆదేశించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ నందు డిసెంబర్ 3 న జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలకు  సంబంధించి ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన చోట  లైవ్ కెమెరాలు ఈ నెల 26 తేదీ నాటికి పూర్తి చేయాలని వచ్చే ప్రజా ప్రతినిధులు, పోలింగ్ ఏజెంట్లకు  ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా లైవ్ కెమెరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.  నాలుగు కౌంటింగ్ హాల్స్ లో లోపల,  బయట  లైవ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్ రోజున హాల్ లో 14 టేబుల్స్  , ఆర్.ఓ టేబుల్  అలాగే  ఏర్పాటు చేసే గ్యాలరీలో నాలుగు లైవ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిదంగా నిర్దేశించిన రూట్ నందు,  అన్ని స్ట్రాంగ్ రూమ్స్ వద్ద బయట లైవ్ కెమెరాలు అమార్చాలని సూచించారు.

ఈ సమావేశంలో ఈ. డి.ఎం. గఫ్ఫార్, ఎలక్షన్ సెల్ డి.టి. వేణు, ఎస్.ఆర్.ఎం ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాకు అదనపు బ్యాలెట్ యూనిట్లు; ఎన్నికల నేపథ్యంలో  జిల్లాకు ఈ. సి.ఎల్ నుండి మరో 570 అదనపు బ్యాలెట్ యూనిట్లు వచ్చాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్  ఆవరణలో గల ఈవీఎం గోదాం లో బి.యు లను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ హైద్రాబాద్  ఈ. సి.ఎల్ నుండి కంటైనర్లో 57 ఐరన్ బాక్స్ లలో 570 బ్యాలెట్ యూనిట్లు వచ్చాయని, గోదాంలో పోటీ అభ్యర్థులు, పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాంలో  భద్రపరిచామని అన్నారు.  తదుపరి చర్యలకై త్వరలో ఎఫ్.ఎల్.సి చేయడం జరుగుతుందని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు.
    ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఏ. వెంకట్ రెడ్డి, ఆర్.డి.ఓ వీరబ్రహ్మ చారి, డి.ఎం. రాంపతి నాయక్, ఏ.ఓ సుదర్శన్ రెడ్డి, ఎన్నికల విభాగం సిబ్బంది, తహశీల్దార్లు వివిధ పార్టీల పోటీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

కౌంటింగ్ కి కట్టుదిట్టమైన ఏర్పాట్లు - సాధారణ, వ్యయ పరిశీలకులతో ఏ.ఎం.సి. గోదాం పరిశీలన

కౌంటింగ్ కు ఏ.ఎం.సి. గోదాం లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సాధారణ పరిశీలకులు బాలకిషన్ ముండా, కౌశిగన్ అలాగే వ్యయ  పరిశీలకులు ప్రమోద్ కుమార్, విజయ్ నెట్ కె , యస్.పి. రాహుల్ హెగ్డే లతో కలసి సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ , తుంగతుర్తి  కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్ రూమ్స్ లను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని కేంద్రాలలో నిరంతర విద్యుత్ అలాగే సౌండ్ ఫ్రూఫ్ జనరేటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. పార్టీషన్, బారికెట్ల , గ్యాలరీలు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అన్ని స్ట్రాంగ్ రూమ్స్ లలో నెంబర్ మార్కింగ్ చేయాలని సూచించారు. గోదాం లను కట్టడిలోకి తీసుకొని పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఈ నెల 26 నాటికి అన్ని ఏర్పాట్లు చేపట్టి కౌంటింగ్ కి అందుబాటులో ఉంచాలని  సూచించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రూట్లు, పోలింగ్ ఏజెంట్ల బ్లాక్స్, ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా ఏర్పాట్లు ఉండాలని అన్నారు. అనంతరం నాలుగు నియోజక వర్గాల మ్యాప్ లను పరిశీలించారు.

     ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఏ. వెంకట్ రెడ్డి, పర్సనల్ ఎస్పీ నాగేశ్వరావు డిఎస్పి నాగభూషణం ఆర్.డి.ఓ లు కోదాడ సూర్యనారాయణ, సూర్యాపేట వీరబ్రహ్మ చారి, హుజూర్ నగర్ జగదీశ్వర్ రెడ్డి, తహశీల్దార్లు, ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.