ప్రశ్నిస్తే అరెస్ట్ చేయటం సిగ్గు చేటు

ప్రశ్నిస్తే అరెస్ట్ చేయటం సిగ్గు చేటు

మరో నిజాం ను తలపిస్తున్న KCR తీరు: బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్రంలో  గత కొన్ని రోజులుగా ప్రశ్నించే వారిని అరెస్ట్ చేయటం ఆనవాయితీగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే అరెస్ట్ చేయటం సిగ్గు చేటని బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జి కే. వెంకట్ రమణారెడ్డి అన్నారు.
పార్లమెంట్ సభ్యున్ని సెర్చ్ వారెంట్ లేకుండా అర్ధ రాత్రి అరెస్ట్ చేయడం దేనికని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆద్వర్యంలో నిన్న రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ వేయడాన్ని నిరసిస్తూ  ఆధ్వర్యంలో నిజాంసాగర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా  కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ  పోలీసుల తీరు కూడా ఇబ్బందిగా మారిందని అన్నారు. TSPSC పేపర్ లీకేజీ, పదవ తరగతి ప్రశ్న పత్రం లీకేజీ ఇలా సరియైన పాలన చేత కాక రోజు లీకేజీ లకు కారణం అవుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు.  KCR తీరు మరో నిజాం ను తలపిస్తున్నదని అన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు.     బాన్సువాడ లో....                     బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో అంబెడ్కర్ చౌరస్తా వద్ద రాస్తా రోకో నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ సెగ్మెంట్ ఇంచార్జి కొత్త కొండ భాస్కర్, పైడిమల్ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు