అంగన్వాడీ, వీఆర్ఏల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలి

అంగన్వాడీ, వీఆర్ఏల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలి

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ

ముద్ర,పానుగల్: అంగన్వాడీలు, వీఆర్ఏల పెండింగ్ జీతాలను నూతన ప్రభుత్వం వెంటనే చెల్లించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా మాజీ అధ్యక్షులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. కళావతమ్మ అన్నారు. సోమవారం పానుగల్ మండలం కేతేపల్లి గ్రామంలో  మహిళ సమాఖ్య ముఖ్యుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.వనపర్తి జిల్లాలో వనపర్తి, ఆత్మకూరు, పెబ్బేరు మూడు క్లస్టర్లలలో వందలాదిమంది అంగన్వాడీలలో టీచర్లు, ఆయాలుగా మహిళలు పని చేస్తున్నారని సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు మూడు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయన్నారు.

ఒక్క పాన్గల్ మండలంలోనే 59 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయన్నారు. అంగన్వాడీ టీచర్లకు నెలకు 13650,ఆయాలకు 7800 అతి తక్కువ వేతనం పై పనిచేస్తున్నారని, పెండింగ్ వేతనాలతో వారి కుటుంబాలు గడవడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం వహించిందని కొత్త ప్రభుత్వం పై కోటి ఆశలతో జీతాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంవీఆర్ఏలకు కూడా ప్రమోషన్లు ఇచ్చి వివిధ పోస్టుల్లో భర్తీ చేసిందని నాలుగు నెలలుగా జీతాలు లేవని, చెల్లించాలని కోరారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలు హత్యలు పెరిగాయని, బాల్య వివాహాలు అరికట్టాలని సంఘటితమై హక్కుల కోసం పోరాడాలని కోరారు. ఈ సమావేశంలో తారకమ్మ,అలివేల,ఆవుల లక్ష్మి,ఎల్లమ్మ,ఎస్.లక్షి, అంజనమ్మ, బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.