బోనాలతో పోటెత్తిన జనం

బోనాలతో పోటెత్తిన జనం
  • ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కు ఘనస్వాగతం 

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: మాచరెడ్డి మండలం సింగరాయపల్లి, పోతారం, ఇసాయిపేట్, మంచం దేవుని పల్లి గ్రామాల్లో మహిళలు గ్రామస్తులు బోనాలతో ప్రభుత్వ గంప గోవర్ధన్ గారికి ఘన స్వాగతం లభించింది ముఖ్యమంత్రి కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర రావు  తరపున ప్రచారం నిర్వహిస్తున్న గంప గోవర్ధన్ కు అపూర్వ ఆదరణ లభించింది ఆదివారం సింగరాయపల్లి పోతారం ఇసాయి దేవునిపల్లి వాడి పరిధిపేట్ బండ రామేశ్వర్ పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముఖ్యమంత్రి కామారెడ్డి నుండి పోటీ చేయడం మన అదృష్టం అన్నారు కామారెడ్డి అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు. ప్రజలందరూ మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.