చిన్న మల్లారెడ్డిలో పోలీసుల మెరుపు దాడి
- రూ.3.26లక్షల విలువ చేసే మద్యం స్వాధీనం
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: మండలం లోని చిన్న మల్లారెడ్డి గ్రామంలో ఒక ఇంట్లో అక్రమంగా మద్యం నిలువ ఉంచారనే సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడి నిర్వహించి రూ.3.26లక్షల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు. దేవనపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై తన సిబ్బంది,ఎన్నికల ప్రవర్తన నియమావళి కి సంబంధించిన అధికారుల సహాయంతో చిన్న మల్లారెడ్డి గ్రామానికి వెళ్ళారు. అక్కడ బాణాల చిన్న పెద్దులు అనే వ్యక్తి ఇంట్లో తనిఖీ చేయగా రాయల్ స్టాగ్180ML గల మొత్తం 1656 బాటిళ్లు మొత్తం 296 లీటర్లు లభించగా. దీని విలువ సుమారు రూ. 3,26,370/- ఉంటుంది. ఇలా అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని సీజ్ చేశారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల వేళ మద్యాన్ని అక్రమముగా నిలువ ఉంచిన బాణాల చిన్న పెద్దులు, మద్యాన్ని అమ్మిన వైన్స్ యజమాని పైన దేవనపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.ఇకపై కూడా ఎవరైనా అక్రమ మద్యం నిలువలకు పాల్పడితే వాటిని సీజ్ చేయడమే కాకుండా వారిపై చట్ట ప్రకారం ఖటిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని జిల్లా ఎస్పీ గారు తెలిపినారు.