కొంపముంచిన కారు సడన్ బ్రేక్

కొంపముంచిన కారు సడన్ బ్రేక్
  • తిరిగిరాని లోకాలకు యువకుడు
  • యువకుని మృతితో తమ్మర బండ పాలెం లో విషాదఛాయలు

కోదాడ, ముద్ర: రోడ్డు ప్రమాదంలో ప్రతి మృతి చెందిన సంఘటన అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్మర గ్రామ శివారులో గల రాజరాజేశ్వరి రైస్ మిల్లు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. అనంతగిరి ఎస్సై ఐలయ్య తెలిపిన వివరాల ప్రకారం... తమ్మర బండ పాలెం గ్రామానికి చెందిన ఎలక నాగరాజు ఆదివారం మధ్యాహ్నం సమయంలో తన ద్విచక్ర వాహనంపై కోదాడలో పని ముగించుకుని  తమ్మరబండ పాలెం వెళుతుండగా మార్గమధ్యంలో రాజ రాజేశ్వరి రైస్ మిల్లు వద్ద అతని ముందు అతివేగంతో వెళుతున్న కారును డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో, ఎనక ద్విచక్ర వాహనంపై ఉన్న నాగరాజు కారుకు వెనుక వైపు తగిలి కింద పడిపోగా అదే సమయంలో ఖమ్మం నుండి కోదాడకు అతివేగంతో వెళుతున్న టిప్పర్ లారీ నాగరాజు కాల మీద నుండి వెళ్ళగా రెండు కాళ్లు నుజ్జును అయ్యాయి.

తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అంబులెన్స్ లో కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా... పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చూసిన మేరకు సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లుగా తెలిపారు మృతుడు అన్న ఎలక సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కార్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ తెలిపారు.