ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి : కలెక్టర్

ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి : కలెక్టర్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:ఈ నెల 30 న  రాష్ట్ర  శాసన సభకు జరిగే ఎన్నికలకు ఓటర్లు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఓటువేసేందుకు జిల్లా  యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని జిల  ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరుగా నమోదయిన ప్రతిఒక్కరు  నైతిక బాధ్యతగా శతశాతం వేటువేయవలసినదిగా విజ్ఞప్తి చేశారు. ఓటు  హక్కు ప్రాధాన్యతపై ,  విస్తృతంగా అవగాహనా కల్పించామని,   ఓటర్ కార్డులు, స్లిప్పులు లేకపోయినా ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒక దానిని  తీసుకువెళ్లి ఓటు వేయాలన్నారు.  పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని, నిర్ణీత సమయములో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న అందరికి  ఓటు వేసేందుకు అనుమతిసీతామన్నారు. 

ఓటరు గుర్తింపు కార్డు నెంబరును   టైపు చేసి 9211728082 కు  SMS ద్వారా కానీ, నిరంతరం పనే చేసే హెల్ప్ లైన్ 1950 నెంబరు ద్వారా కానీ,  www.voters.eci.gov.in, www.ceotelangana.nic.in వెబ్సైట్ల ద్వారా , ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐవోఎస్ వినియోగదారులు యాప్ స్టోర్ నుంచి   ఓటరు హెల్ప్ లైన్ యాప్  ను డౌన్లోడ్ చేసుకుని   తమ పోలింగ్ కేంద్రం, బూత్ నెంబర్ తదితర వివరాలను తెలుసుకోవచ్చన్నారు. ఇప్పటికే  ఎలక్ట్రానిక్ ఓటింగ్  యంత్రాలు, ఓటింగ్ ప్రక్రియకు కావలసిన సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించామన్నారు.  ఈసారి   పోలింగ్  సిబ్బంది ఆయా నియోజక వర్గాలకు చేర్చేందుకు, తిరిగి గమ్య స్థానాలు చేరేందుకు   ఉచితంగా  బస్సులు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.                                                                

పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్                                         

పోలింగ్ అధికారులు  ఈ.వి.ఏం. యంత్రాలను, పోలింగ్ మెటీరియల్ ను చెక్ లిస్ట్ ప్రకారం సరిచూసుకుని తమకు కేటాయించిన ల్పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ సూచించారు. బుధవారం జుక్కల్, యెల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ సిబ్బందికి, అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.  పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లి ప్రతి బస్సుకు జి.ఫై.ఎస్. ట్రాకింగ్ ఏర్పాటు చేశామని, తిరిగి రిసిప్షన్ కేంద్రాలకు వచ్చిన తరువాత క్లోజ్డ్ కంటైనెర్ ల ద్వారా స్ట్రాంగ్ రూమ్ లకు జి.పి .ఎస్. ట్రాకింగ్ ద్వారా తరలిస్తామన్నారు.  పోలింగ్ సిబ్బంది  ఎట్టి  పరిస్థితులలోను తమకు కేటాయించిన కేంద్రాలలోనే బస చేయాలని, ఓటు గోప్యతకనుగుణంగా  పోలింగ్ కేంద్రంలో కంపార్ట్మెంట్, సిబంది, ఏజెంట్లు కూర్చునే విధంగా సిట్టింగ్ ఏర్పాటు చేసుకొని అవసరమైన ఫారాలను సిద్ధం చేసుకొని ఉదయం 5. 30  గంటలకు పోలింగ్ ఏజెంట్ ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి   క్లియర్ చేయాలని సూచించారు,. అనంతరం కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ ను సందర్శించి ఈ రెండు రోజులు అత్యంత కీలకమని ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలలో వచ్చే వార్తలను నిశితంగా పరిశీలిస్తు ఓటింగ్ సరళికి సంబంధించి పుకార్లు, అసత్య వార్తలు ప్రసారమవుతుంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలుపుతూ వాటి నిలుపుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కు సంబంధించి ఓటింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తూ  ఎటువంటి చిన్న సంఘటన దృష్టికి వచ్ఛోనా వెంటానే తెలపాలన్నారు. అనంతరం కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి  ఏర్పాట్లను పరిశీలించారు. ఈసారి ప్రతి టేబుల్ దగ్గర ఓట్ల లెక్కింపును సి.సి.కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని,  కౌంటింగ్ హాల్ లో రౌండ్ వారీగా ఫలితాలను రిటర్నింగ్  అధికారి ప్రకటించేలా  చూడాలని,పోలింగ్ ఏజెంట్ లకు తగు వసతులు కల్పించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ లో, కౌంటింగ్ హాల్ లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడవలసినదిగా విద్యుత్తు అధికారులకు సూచించారు. ప్రతి నియోజక వర్గానికి సంబంధించి రౌండ్  వారీగా ఫలితాలను ఎప్పటికప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసున్న మీడియా కేంద్రంలో   పాత్రికేయులకు అందించేలా చూడాలని  అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమాలలో రిటర్నింగ్ అధికారులు మను చౌదరి, మన్నె  ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి,   నోడల్ అధికారులు సింహ రావు, దయానంద్, సతీష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.