రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

4 కోట్ల ప్రజలకు సేవకులుగా పని చేస్తాం
తెలంగాణ సమాజానికి నలుగురే శత్రువులు
బిఆరెస్ పార్టీకి 25 సీట్లు దాటవు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: తెలంగాణ లో ఒకే రకమైన సునామీ వచ్చిందని, డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తథ్యమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డ్ అన్నారు. ఆయన కామారెడ్డి లో విలేకరులతో మాట్లాడారు. సీడబ్ల్యూసీ ఆదేశాలు, ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు ముందుకు సాగుతామని అన్నారు. కామారెడ్డి లో కేసీఆర్ ను ఒడిస్తున్నామని అన్నారు. కేసీఆర్ శాశ్వతంగా అధికారంలో ఉంటామని కలలు కన్నారని అన్నారు. ఆ కలలు చెదిరాయని అన్నారు. దొరల తెలంగాణ అంతమైందని, ప్రజల తెలంగాణ రాబోతోందని అన్నారు.  సోనియా గాంధీకి కృతజ్ఞతతో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని అన్నారు. ఎం ఐ ఎం మైనార్టీల యజమానులు కాదని, అయితే ముస్లింల అభివృద్ధి కి వారు ఇచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. ప్రతి ఒక్క ప్రాంతాన్నీ అభివృద్ధి చేస్తామని అన్నారు. 

ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ గెలుస్తుందని తెలిసి కేసీఆర్ ముఖం చాటేసి కేటీఆర్ తో ప్రెస్ మీట్ పెట్టించారని అన్నారు. ప్రజాస్వామ్యం లో గెలుపు ఓటములు సహజమని,  ప్రతిపక్షాలు బాధ్యత యుతంగా వ్యవహరించాలని అన్నారు. మీడియా కూడా సమస్యలను ఎత్తిచూపేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు సేవ చేసే అవకాశం కల్పించారని అన్నారు. ప్రతీకార చర్యలు ఏవి చేయకూడదని అన్నారు. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో అమర వీరుల సంక్షేమం కోసం కమిటీ వేస్తామని అన్నారు.  విలేకరుల సమావేశంలో మాజీమంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్సీ ఆర్కెల నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.