బాన్సువాడలో ఆర్డిఓ ఆఫీస్ ఎదుట ధర్నా

బాన్సువాడలో ఆర్డిఓ ఆఫీస్ ఎదుట ధర్నా

బాన్సువాడ, ముద్ర: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం నాడు బాన్సువాడ ఆర్డిఓ కార్యాలయం ముందు రాష్ట్రవ్యాప్త పిలుపుమేరకు ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏవోకు అందజేశారు. ఈ ధర్నా ను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాస్ రాములు మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మున్సిపాలిటీలలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు  రోజు కూలీ 600 రూపాయలుకు పెంచాలని , ఏడాదికి 200 రోజులకు పని దినాలు పెంచాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.  50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు  5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు కూలి బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పని చేస్తున్న ప్రదేశంలో నీడ కొరకు టెంట్లు, మంచినీరు, మెడికల్ కిట్లు తదితర సౌకర్యాలు కల్పించాలని కూలీ డబ్బులు సకాలంలో చెల్లించాలని కోరారు. ఈ ధర్నాలో ఎల్లయ్య, సాయిలు, కమ్మరి రాములు, విట్టల్, గణేష్, ఎల్లవ్వ, లక్ష్మి, రాములు, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు