వృద్ధురాలిని ఈడ్చికెళ్లి మరీ చంపిన వీధికుక్కలు

వృద్ధురాలిని ఈడ్చికెళ్లి మరీ చంపిన వీధికుక్కలు

ముద్ర,కామారెడ్డి:- కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చాపేటలో గురువారం ఉదయం ఇంటి బయట కూర్చున్న రామవ్వ (60)పైకి వీధికుక్కలు ఒక్కసారిగా దాడిచేశాయి. వృద్ధురాలిని చుట్టుముట్టి మరీ రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి మరీ దాడి చేశాయి. ఇది గమనించిన స్థానికులు.. వెంటనే వీధికుక్కలను తరిమికొట్టారు. అనంతరం తీవ్రంగా గాయపడిన రామవ్వను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే రామవ్వ మరణించింది.