కామారెడ్డి జిల్లాలో 24.56 శాతం పోలింగ్

కామారెడ్డి జిల్లాలో 24.56 శాతం పోలింగ్
  • కామారెడ్డిలో బిఆరెస్, కాంగ్రెస్ మధ్య వాజ్5
  • పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పోచారం

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: జిల్లాలో పట్టణాలు,మారుమూల ప్రాంత పల్లెలో  ఓటర్లు బారులు తీరారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  కామారెడ్డి లో కాంగ్రెస్, బిఆరెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి, బిఆరెస్ నేత నిట్టు వేణుగోపాల్ కు మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రం లో ఎలా వస్తారని నిలదీశారు. రోడ్డుపై బిఆరెస్ నాయకులు బైఠాయించారు. ఇదిలావుండగా బాన్సువాడ లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో లైటింగ్ సమస్య ఉందని గుర్తించారు.

24.56 శాతం పోలింగ్ 

జిల్లాలో ఉదయం 11.00 గంటల వరకు 24.56 శాతం పోలింగ్ నమోదైంది. 

నియోజకవర్గాల వారిగా పోలింగ్ శాతం :

013-జుక్కల్ (SC) : 22.43 శాతం

015-యెల్లారెడ్డి : 25. 24శాతం

016-కామారెడ్డి : 26.02 శాతం

014-బాన్సువాడ: 28.51 శాతం