కామారెడ్డిలో 3వ స్థానంలో కేసీఆర్

కామారెడ్డిలో 3వ స్థానంలో కేసీఆర్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ 3వ స్థానానికి పడిపోయారు. రెండవ రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి 1981 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. రెండవ స్థానంలో బీజేపీ ఉంది. సీఎంగా కేసీఆర్ పై తెలంగాణ ప్రజలు పూర్తి అసంతృప్తిగా ఉన్నారనే విషయం కామారెడ్డి ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బాన్సువాడలో బిఆరెస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ లో బిఆరెస్ అభ్యర్థి హన్మంత్ షిండే, ఎల్లారెడ్డి లో కాంగ్రెస్ అభ్యర్ధి మదన్ మోహన్ ఆధిక్యంలో ఉన్నారు.