బిఆర్ఎస్ కు షాక్ మీద షాక్

బిఆర్ఎస్ కు షాక్ మీద షాక్

ముద్ర, జమ్మికుంట: హుజరాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ కు వరుస షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. నిన్న జమ్మికుంట జడ్పిటిసి శ్రీరామ్ శామ్ టిఆర్ఎస్ కు రాజీనామా చేసి బిజెపిలో చేరాడు, వ్యవసాయమార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, జమ్మికుంటమాజీ జెడ్పిటిసి అరకాల వీరేశలింగం కాంగ్రెసులో చేరారు. నేడు జమ్మికుంట ఎంపీపీ దొడ్డే మమత 50 మంది కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సమక్షంలో కాంగ్రెస్లోకి చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మమత మాట్లాడుతూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఒంటెద్దు పోకట నచ్చక పార్టీని వీడినట్లు మమత తెలిపారు. ప్రణవ్ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు.