ఘనంగా కాసాని జ్ఞానేశ్వర్ జన్మదిన వేడుకలు

ఘనంగా కాసాని జ్ఞానేశ్వర్ జన్మదిన వేడుకలు

ముద్ర ప్రతినిధి భువనగిరి :తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు  జన్మదినం సందర్భంగా జిల్లా టిడిపి నాయకులు శనివారం సహోదయ అనాధ ఆశ్రమంలో కేకు కట్ చేసి పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా భువనగిరి నియోజకవర్గ ఇన్చార్జి మన సంజీవరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల  అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసానంగాశ్వర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలన్నారు. త్వరలో చేపట్టే బస్సు యాత్ర విజయవంతం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలిమినేటి సుధాకర్ రెడ్డి, భువనగిరి మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబోయిన రమేష్ యాదవ్, ఉపాధ్యక్షులు పెద్దింటి కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కనకరాజు ముదిరాజు పాల్గొన్నారు.