ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం 

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం 

ముద్ర ప్రతినిధి భువనగిరి :184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా పట్టణ  అధ్యక్షుడు రావుల నాగరాజు ఆధ్వర్యంలో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వినాయక చౌరస్తాలో కేక్ కటింగ్ చేసి పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భీమిడి మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి  దిడ్డికాడి రాము, మండల గౌరవ అధ్యక్షుడు అప్పల రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి  మాటూరు నరసింహ, కోశాధికారి కొత్త నగేష్, కమిటీ సభ్యులు విక్రమ్, దశరథ, సురేష్, అనిల్, రామరాజు, ఐలయ్య, రాజు, ఫోటో వీడియో గ్రాఫర్స్ పాల్గొన్నారు.