మైనారిటీల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్

మైనారిటీల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్
  • మైనారిటీలఎకనామిక్ సపోర్ట్ స్కిం ద్వారా  లక్ష రూపాయలను సహాయం  చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:-మైనారిటీల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.మైనారిటీల సంక్షేమం కోసం దేశంలోని ఏ రాష్ట్రమూ తెలంగాణ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేయలేదన్నారు.శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని బేగం ఫంక్షన్ హాల్ లో మైనార్టీలకు ఎకనామిక్ సపోర్ట్ స్కీం లో భాగంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కులు  మంత్రి సబిత ఇంద్రారెడ్డి పంపిని చేసారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి  మాట్లాడుతూ...

ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక పాలనలో తెలంగాణలో హిందూ ముస్లిం సోదరుల వలె ఉంటూ ఐక్యతను చాటుతూ ,గంగా జమునా తహజీబ్ ను కాపాడుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ముస్లిం మైనార్టీల సంఖ్య కోటిన్నర జనాభా ఉన్న మహారాష్ట్రలో బడ్జెట్ లో 674 కోట్లు కేటాయిస్తే, 50 లక్షలు ఉన్న తెలంగాణలో 2,200 కోట్లు కేటాయించారన్నారు.తెలంగాణ ఏర్పాటు తర్వాత మైనార్టీ సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ గారు పదివేల కోట్లు ఖర్చు చేసారని మంత్రి పేర్కొన్నారు.ముస్లిం మైనారిటీ విద్యార్థుల కోసం 204 పాఠశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తూ ముస్లిం యువతను రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని, గురుకులాలలో అమ్మాయిలకు 50 శాతం కేటాయించారన్నారు.మైనారిటీల్లోని పేదలకు నిరుద్యోగులు సొంత వ్యాపారాలు నిర్వహించుకోవడానికి లక్ష రూపాయల ఉచిత గ్రాంటును అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్  నిర్ణయించారని, లక్ష మందికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుందనీ అన్నారు. 

షాది ముబారక్ ద్వారా 9 ఏళ్లలో రెండున్నర లక్షల మంది పెళ్లిళ్లకు మొత్తం రూ. 2,130 కోట్లు ప్రభుత్వం అందించింది.రంగారెడ్డి జిల్లాలో 187 కోట్లు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరిందని, మైనారిటీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ క్రింద విద్యార్థులకు 2014 సంవత్సరం నుండి 2023  వరకు 1,29,263 మంది విద్యార్థులకు రూ. 402.36 కోట్లు స్కాలర్ షిప్ లు మంజూరు చేసామన్నారు.మైనారిటీ విద్యార్ధులకు ఉన్నత విద్యకై విదేశాలకు వెళ్ళడానికి   ఇప్పటివరకు 155 మంది విద్యార్థులకు 26 కోట్ల ఆర్ధిక సహాయం అందించనట్లు తేలిపారు.తెలంగాణ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్సు కార్పొరేషన్ ద్వారా 5 కోట్ల 40 లక్షలు రుణాలు పంపిణీ చేయడం జరిగిందని, డ్రైవర్ కమ్ ఓనర్  పథకం ద్వారా 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 51మంది లబ్దిదారులు ఎంపిక చేసి కార్లు ప్రభుత్వం అందించిందని అన్నారూ. ఎకనామిక్ సపోర్ట్ స్కిం ద్వారా పూర్తి సబ్సిడీతో 1 లక్ష రూపాయలను 584 మంది లబ్ధిదారులకు 5 కోట్ల 84 లక్షల రూపాయలను రంగారెడ్డి జిల్లాలో అందిస్తున్నమన్నారు.ఈ పథకం లో భాగంగా రాజేంద్రనగర్153, మహేశ్వరం131, ఎల్ బి.నగర్ 19,షాద్ నగర్ 67,చేవెళ్ల 54,ఇబ్రహీంపట్నం  69, కల్వకుర్తి 30, శేరిలింగంపల్లి 61 మందికి లక్ష రూపాయల చొప్పునఅందిస్తున్నట్లు తెలిపారు.మౌజాం,ఇమామ్ లకు జీతాలు ఇస్తూ రంజాన్ సందర్భంగా తోఫా లు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో  రంగారెడ్డి  జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి ,రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే  ప్రకాష్ గౌడ్ , చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ,షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ,ఎమ్మెల్సీ దయనంద్ గుప్తా తదితరులు హాజరయ్యారు.