రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సిమెంట్ బెంచీల ఏర్పాటు

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సిమెంట్ బెంచీల ఏర్పాటు

ముద్ర ప్రతినిధి భువనగిరి :డా.పద్మజ సంతాన సాఫల్య కేంద్రం హబ్సిగూడ సౌజన్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్ ఆధ్వర్యంలో శనివారం సిమెంట్ బెంచ్ లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు పకీరు కొండల్ రెడ్డి మాట్లాడుతూ  మండలంలోని అనంతారo గ్రామంలో పల్లె దవఖాన వద్ద మూడు సిమెంట్ బెంచీలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్  వద్ద రెండు బెంచీలు, బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ బస్ స్టాప్  వద్ద రెండు రూ.28 వేల రూపాయలు బెంచీలను  ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యూ క్లబ్స్ డెవలప్మెంట్ చైర్మన్ జోన్ 2 డా. ఎంపల్ల బుచ్చిరెడ్డి, మాజీ అధ్యక్షులు  జిల్లాల కొండల రెడ్డి, సభ్యులు జిట్టా భాస్కర్ రెడ్డి, డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ కొండా మురళి, గ్రామస్తులు చిగురుపల్లి సోమయ్య, కొత్తపెళ్లి దుర్గయ్య, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.